Vishal: చంద్రబాబుకే అలా జరిగిందంటే.. సామాన్యుడికి భయమేస్తుంది: హీరో విశాల్‌

తన కొత్త సినిమా ‘మార్క్‌ ఆంటోని’ సక్సెస్‌ మీట్‌లో చంద్రబాబు నాయుడి అరెస్ట్ గురించి ప్రశ్న ఎదురవగా హీరో విశాల్‌ సమాధానమిచ్చారు. ఆయనకే అలా జరిగిందంటే.. సామాన్యులకు భయమేస్తుందన్నారు.

Published : 20 Sep 2023 16:46 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌ తీరుపై హీరో విశాల్‌ (Vishal) స్పందించారు. ఆయనకే అలా జరిగిందంటే సామాన్యుడికి భయమేస్తుందని అన్నారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన తన కొత్త సినిమా ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) సక్సెస్‌ మీట్‌ (Mark Antony Success Celebrations)లో విశాల్‌ పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ‘‘ఓ కేసు విషయంలో చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. నేను ఇక్కడ ఓటు వేయలేదు. తమిళనాడులో వేశా. కానీ, ఓ వ్యక్తిగా మాట్లాడాల్సి వస్తే.. చంద్రబాబును అరెస్ట్‌ చేసే ముందు వారు బాగా ఆలోచించాల్సింది. ఎందుకంటే చంద్రబాబులాంటి వ్యక్తికే ఇలా జరిగిందంటే నాలాంటి సామాన్యుడికి భయమేస్తుంది. సినిమా ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఆ పరిణామాలను నేను లోతుగా పరిశీలించలేదు. ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం ఉంది. బయట మేం నటులు కావొచ్చుగానీ ఇంట్లో సామాన్యులమే’’ అని విశాల్‌ పేర్కొన్నారు.

రాజమౌళి కొత్త సినిమా పేరు మార్చుకోవాలి.. అభిమానుల కామెంట్స్‌..!

సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘కొత్తదనం ఉన్న ఈ కథ వినగానే నచ్చింది. అందుకే రిస్క్‌ అనుకోలేదు. ఈ సందర్భంగా రచయిత రాజేశ్‌ మూర్తికి థ్యాంక్స్‌ చెబుతా. ‘మార్క్‌ ఆంటోని’ స్ట్రైట్‌ తెలుగు సినిమాలా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డారు. ప్రతి పాత్ర సంభాషణల విషయంలో బాగా శ్రద్ధ తీసుకున్నారు. ప్రేక్షకుల ఆదరణే నాకు చాలు. ఎలాంటి అవార్డులు అవసరం లేదు’’ అని అన్నారు. విశాల్‌, ఎస్‌.జె. సూర్య (SJ Suryah) ప్రధాన పాత్రల్లో దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కించిన చిత్రమే ‘మార్క్‌ ఆంటోని’. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులోనూ సెప్టెంబరు 15న విడుదలైంది. ప్రేక్షకుల ఆదరణ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. విశాల్‌తోపాటు ఎస్‌.జె. సూర్య, కీలక పాత్ర పోషించిన టాలీవుడ్‌ నటుడు సునీల్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని