Rajamouli: రాజమౌళి కొత్త సినిమా పేరు మార్చుకోవాలి.. అభిమానుల కామెంట్స్‌..!

రాజమౌళి (Rajamouli) తాజాగా ఓ సినిమా గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దాని పేరు విషయంలో కొందరు ఫ్యాన్స్‌ ఆయనకు సూచనలిస్తున్నారు.

Published : 20 Sep 2023 14:33 IST

హైదరాబాద్‌: దర్శధీరుడు రాజమౌళి (Rajamouli) తాజాగా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమైన సంగతి తెలిసిందే. భారతీయ సినీ పరిశ్రమకు ఆద్యుడు దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ను ఆయన సమర్పిస్తున్నారు. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ (Made In India) పేరిట ఇది రూపొందనుంది. అయితే, ఈ విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. దీని పేరు విషయంలో కొందరు అభిమానులు కామెంట్ల సెక్షన్‌లో ఆయనకు సూచనలిస్తున్నారు.

మన దేశం పేరును ఇండియా బదులు భారత్‌గా వ్యవహరిస్తారని గతకొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమౌళి సమర్పించనున్న సినిమా పేరును కూడా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ బదులు ‘మేడ్‌ ఇన్‌ భారత్‌’ (Made In Bharat)గా మార్చాలంటూ కొందరు ట్వీట్‌ చేస్తున్నారు. ‘టైటిల్‌లో ఇండియాను తీసేసి భారత్‌ను చేర్చండి’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. దీనిపై చిత్రబృందం స్పందించలేదు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. భారత చలనచిత్ర పరిశ్రమ ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ఇది రూపొందనుంది. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఎస్‌ఎస్‌ కార్తికేయ, వరుణ్‌ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కథ వినగానే తానెంతో భావోద్వేగానికి గురైనట్లు రాజమౌళి తెలపడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ చిత్రంలో టాలీవుడ్‌ అగ్ర హీరోలు నటించే అవకాశాలున్నాయి. 

స్టేజ్‌పై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. వీడియో వైరల్‌

ఇక త్వరలోనే మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగే కథగా ఇది రూపొందనుంది. ఈ చిత్రంలో భారీగా పోరాట సన్నివేశాలు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని