Poonam Kaur: పూనమ్‌ కౌర్‌ ఫొటో వైరల్‌.. పెళ్లి కుదిరిందా అంటోన్న నెటిజన్లు

సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి పూనమ్‌కౌర్‌ (Poonam Kaur) షేర్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 14 Oct 2022 13:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్విటర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటి పూనమ్‌కౌర్‌ (Poonam Kaur) షేర్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లకు కర్వాచౌత్‌ (Karwa Chauth) శుభాకాంక్షలు చెబుతూ గురువారం రాత్రి పదిగంటల సమయంలో ఆమె ఓ ఫొటో షేర్‌ చేసింది. ఇందులో పూనమ్‌.. జల్లెడ చేతిలో పట్టుకుని చంద్రుడి వైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘‘మేడమ్‌ ఈ పండుగ పెళ్లైన మహిళలు మాత్రమే చేసుకుంటారు. మరి మీరెందుకు చేస్తున్నారు?’’, ‘‘మీకు పెళ్లి కుదిరిందా?’’, ‘‘చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని చూస్తారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో కర్వాచౌత్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. భర్త దీర్ఘాయుష్షును కోరుతూ పెళ్లైన మహిళలు పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం చేస్తారు. చంద్రుడి దర్శనంతోనే ఈ వేడుకలు పూర్తవుతాయి. జల్లెడలో చంద్రుడిని.. ఆవెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. పెళ్లి కాని యువతులు కూడా కాబోయే వారితో కలిసి ఈ పూజలు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని