Ramya Krishna: అతనొక స్వీట్‌ హార్ట్‌.. ఫుల్‌ ఎనర్జీతో ఉంటాడు: రమ్యకృష్ణ

‘లైగర్‌’(Liger) ప్రచారంలో భాగంగా టాలీవుడ్‌ నటులంతా ముంబయిలో బిజీగా ఉన్నారు. హీరోహీరోయిన్లు ఒక చోట ప్రచారం చేస్తే, దర్శక నిర్మాతలు మరోచోట సినిమా ప్రమోషన్స్‌లో...

Published : 21 Aug 2022 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లైగర్‌’(Liger) ప్రచారంలో భాగంగా టాలీవుడ్‌ నటులంతా ముంబయిలో బిజీగా ఉన్నారు. హీరోహీరోయిన్లు ఒక చోట ప్రచారం చేస్తే, దర్శక నిర్మాతలు మరోచోట సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. లైగర్‌ లో హీరో తల్లి పాత్ర పోషించిన ప్రముఖ నటి రమ్యకృష్ణ(Ramya Krishna) ఇటీవల ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఆమెను బాలీవుడ్‌ మీడియా అక్కడి స్టార్లతో నటించిన చిత్రాలపై ప్రశ్నించగా ఆమె 1996 నాటి ‘చాహత్‌’(Chaahat) సినిమా గురించి ప్రస్తావించారు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ప్రతినాయిక పాత్రను పోషించారు. ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె ‘ షారుక్‌ ఒక స్వీట్‌హార్ట్‌. సంస్కారం తెలిసిన వ్యక్తి. చుట్టూ ఉన్న వారిని తన ప్రవర్తనతో ఇట్టే ఆకట్టుకుంటాడు. నేనప్పుడే హిందీ ఇండస్ట్రీకి పరిచయమవ్వడంతో సినిమా విషయంలో నాకు చాలా సహాయం చేశాడు. అతను రోజంతా ఫుల్‌ ఎనర్జీతో ఉంటాడు రణ్‌వీర్‌సింగ్‌లాగా’ అంటూ అప్పటి విషయాలను వెల్లడించారు.

ఇక లైగర్‌లో విజయ్‌ దేవరకొండ తల్లిగా నటించిన ఆమె తాను నటించిన వినూత్నమైన పాత్రల్లో ఇదొకటిగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్‌ 169వ చిత్రమైన ‘జైలర్‌’లో ప్రత్యేకపాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం బీటౌన్‌లో బాయ్‌కాట్‌ పదం వినిపిస్తుండగా, లైగర్‌ టీం స్వేచ్ఛగా ప్రమోషన్స్‌లో పాల్గొనడం పట్ల హిందీ సినీ అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వం వహించిన లైగర్‌  చిత్రానికి కరణ్‌ జోహార్ (Karan Johar) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు25న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని