Adivi Sesh: ప్రేమకథలో అడివి శేష్‌

అడివి శేష్‌ సినిమాల్లో యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలే కాదు... ప్రేమ నేపథ్యం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది.

Updated : 25 Sep 2023 14:03 IST

అడివి శేష్‌ సినిమాల్లో యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలే కాదు... ప్రేమ నేపథ్యం కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది. ఎలాంటి కథల్లో అయినా ఒదిగే కథానాయకుల్లో ఆయన ఒకరు. ఈసారి ఆయన ప్రేమకథలో నటించనున్నారు. ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఒక ప్రేమకథ కోసం లుక్‌ టెస్ట్‌ జరిగిందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. నవంబరు లేదా డిసెంబరులో ఆ చిత్రాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. ‘హిట్‌2’ తర్వాత ఆయన ‘గూఢచారి 2’ కోసం రంగంలోకి దిగారు. కొత్తగా ఒప్పుకున్న ప్రేమకథ, ‘గూఢచారి 2’ సినిమాలు రెండూ ఒకే నెలలో ప్రారంభమవుతాయని అడివి శేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని