Akhil Akkineni: ఏజెంట్‌ జర్నీ క్రేజ్‌.. క్యారెక్టర్‌ వైల్డ్‌.. : అఖిల్‌

Agent: అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరులతో మాట్లాడింది.

Published : 15 Apr 2023 21:14 IST

హైదరాబాద్‌: ‘ఏజెంట్‌’ (Agent) సినిమాతో నటుడిగా కొత్త బౌండరీలను దాటానని ఈ సినిమా జర్నీ క్రేజీగా.. ఇందులో నా పాత్ర వైల్డ్‌గా ఉంటుంది యువ కథానాయకుడు అఖిల్‌ (Akhil Akkineni) అన్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముటి,  డైనో మోరే, విక్రమ్‌ జిత్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిల్‌ మాట్లాడారు.

‘‘ఇది రెండేళ్ల జర్నీ. ‘ఏజెంట్‌’ నన్ను పూర్తిగా మార్చేసింది. ‘మిమ్మల్ని ఇబ్బంది పెడతాను.. పడాల్సిందే’ అని సురేందర్‌రెడ్డి చెప్పారు. నేను కూడా ఓకే చెప్పాను. అఖిల్‌ కొత్తగా కనపడుతున్నాడని అంటున్నారంటే అది ఆయన వల్లే. ఈ రెండేళ్ల జర్నీలో సగటు మనిషిగా నేను అలసిపోయిన మాట వాస్తవం. అయితే, సినిమాకు ఏం కావాలో అది అంతా ఇచ్చాననే ఆనందం ఉంది. ఈ సినిమా చేయడం వల్ల మానసికంగా నేను ఎంతో దృఢంగా మారాను. ఒక నటుడిగా సరికొత్త ఫేజ్‌లోకి వచ్చాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముటి సర్‌తో నటించడం నాకు దక్కిన అదృష్టం. వృత్తికి ఆయన ఇచ్చే విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తి నింపారు. ఆయన నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా’’ అని అఖిల్‌ అన్నారు.

‘‘యాక్షన్‌ జానర్‌ నాకు చాలా ఇష్టం. ఈ క్రమంలోనే సురేందర్‌రెడ్డి చెప్పిన ఐడియా నచ్చింది. వెంటనే కథకు ఓకే చెప్పా. ఇప్పుడు ఆయన నిరూపించుకోవడానికి ఏమీ లేదు. కేజీయఫ్‌ కన్నా ముందే గడ్డం పెంచి, పాత్ర కోసం మారడం మొదలు పెట్టా. నా మొదటి చిత్రం ‘అఖిల్‌’ సోషియో ఫాంటసీ మూవీ. కానీ, ‘ఏజెంట్‌’ పూర్తి యాక్షన్‌ మూవీ. కచ్చితంగా ఈ మూవీ గేమ్‌ ఛేంజర్‌. థియేటర్‌కు వచ్చినప్పుడు మీరు రోలర్‌కోస్టర్‌ ఎక్కిన అనుభూతి కలుగుతుంది. నా కెరీర్‌లో ఆలస్యంగా సినిమాలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొవిడ్‌ కూడా ఒకటి. ఇక నాణ్యమైన  సినిమాలే ప్రేక్షకులకు అందించాలన్నది నా భావన. నా తర్వాతి సినిమా కూడా కాస్త ఆలస్యమవుతుంది. సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో నాపైనా, సురేందర్‌రెడ్డిపైనా చాలా రకాలు వార్తలు వచ్చాయి. మేమిద్దరం గొడవపడినట్లు వార్తలు చూసి నవ్వుకునేవాళ్లం. ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఎలా సహజమో.. అలాగే షూటింగ్‌ సమయంలో అవన్నీ మామూలే. ఇక షూటింగ్‌ సమయంలో గాలికి సెట్‌పై భాగం పడిపోయింది. చెక్కతో తయారు చేసిన ఫ్రేమ్‌ నా తలపై పడి విరిగిపోయింది. అదే సమయంలో నన్ను కాపాడటానికి వచ్చిన సురేందర్‌రెడ్డి కాలిపై ఐరన్‌ ఫ్రేమ్‌ పడింది. ఆ రోజు నిజంగా నా పాలిట హీరో.

100 రోజుల్లో సినిమా పూర్తి చేశాం: సురేందర్‌రెడ్డి

‘‘ఈ సినిమా కోసం పని చేసింది కేవలం 100 రోజులు మాత్రమే. బుడాపెస్ట్‌లో షూటింగ్‌ వెళ్తే అక్కడ నాకు కొవిడ్‌ అటాక్‌ అయింది. 20 రోజులు ఆస్పత్రిలో ఉన్నా. ఈ విషయం ఎవరికీ తెలియదు. సినిమా ఆలస్యమవుతోందంటూ వార్తలు రాశారు. ఇప్పటికే సినిమా మొత్తం పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉన్నాం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు ఆదరించినదాని బట్టి ‘ఏజెంట్‌2’ గురించి మాట్లాడదాం. అవకాశం వస్తే నాగార్జునగారితో చేస్తా. ఇది స్పై జానర్‌ మూవీ. పూర్తి ఫిక్షన్‌ మూవీ’’ అని దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని