Akhanda: బాలకృష్ణతో కలిసి నటించడం నా అదృష్టం..: నితిన్ మెహతా
అఖండ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరినీ మెప్పించారు నితిన్ మెహతా. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణతో కలిసి నటించడం పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలకృష్ణ హీరోగా నటించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా ‘అఖండ’. బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నితిన్ మెహతా నటించాడు. ఇండియన్ ఆర్మీలో పనిచేసి తర్వాత సినీ రంగప్రవేశం చేసిన ఈ నటుడు తాజాగా ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడాడు.
‘‘కొవిడ్ సమయంలో అఖండ చిత్రబృందం నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఆశ్చర్యపోయా. దర్శకుడు బోయపాటి శ్రీను ఇన్స్టాలో నా ఫోటోలు చూసి అఖండలో పాత్ర కోసం నన్ను ఎంపిక చేశారట. ఇక బాలకృష్ణతో పనిచేయడం మరచిపోలేని అనుభవం. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సెట్లో కలిసి పనిచేస్తున్నప్పుడు నేను కొత్త వాడినని నాకు ఎప్పుడూ అనిపించలేదు. బాలకృష్ణ ఒక నిఘంటువు. ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతం. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టం’’ అని అన్నారు. ఇక టాలీవుడు గురించి మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమా పరిశ్రమలోని వారు ఎంతో అంకితభావంతో పనిచేస్తారు. నాకు తెలుగు రానప్పటికీ షూటింగ్ సమయంలో ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కోలేదు. నాకు అంత సౌకర్యం కల్పించారు’’అని తెలిపారు.
ప్రస్తుతం నితిన్ మెహతా యంగ్ హీరో నిఖిల్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్పై’లో నటిస్తున్నారు. దీనితో పాటు మరో రెండు తెలుగు సినిమాల్లోనూ ప్రతినాయకుడి పాత్రతో అలరించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ts-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!