Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో..!

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa)కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. 

Updated : 08 Apr 2024 13:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). ఇందులో భారీ తారాగణాన్ని ప్రకటించి అంచనాలు పెంచేసింది చిత్రబృందం. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది.

ఇప్పటికే ఇందులో దక్షిణాదికి చెందిన స్టార్‌ నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ కూడా ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. కొందరు ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. త్వరలోనే అక్షయ్‌ షూటింగ్‌లో జాయిన్ కానున్నారట. ఇదే నిజమైతే ఆయనకు ‘కన్నప్ప’ తొలి తెలుగు సినిమా అవుతుంది. గతంలో 1993లో ఓ కన్నడ సినిమాలో ఆయన కనిపించారు. ఆ తర్వాత 2018లో రజనీ హీరోగా తెరకెక్కిన రోబో2.0లో తమిళ ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఇప్పుడు ఈ మూవీతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. అక్షయ్‌ ఏ పాత్రలో కనిపించనున్నారో మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రంలో అగ్ర కథానాయకులు మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar), శరత్‌ కుమార్‌ భాగమయ్యారు. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. శివ పార్వతులుగా ప్రభాస్‌, నయనతార నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని