
పవన్‌ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది : ఆలీ
తప్పకుండా సినిమా ఉంటుంది..!
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ - హాస్యనటుడు ఆలీ.. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడిన రాజకీయ పరిణామాలతో వీరిద్దరి మధ్య కొంత దూరం వచ్చిందని గతంలో పలువురు చెప్పుకున్నారు. అంతేకాకుండా, దాదాపు ఏడాదిన్నరపాటు వీరిద్దరూ కలవలేదు. ఈ క్రమంలో తాజాగా ఆలీ కుటుంబంలో జరిగిన ఓ వివాహ వేడుకకు పవన్ హాజరయ్యారు. ఆలీతో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
కాగా, ఏడాదిన్నర తర్వాత తన ప్రాణస్నేహితుడ్ని కలవడం గురించి ఆలీ స్పందించారు. పవన్‌ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ‘‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’.. ఈ సినిమాలతో మా స్నేహబంధం ప్రారంభమైంది. ఇప్పటివరకూ ఆయన 27 సినిమాలు చేస్తే.. 25 చిత్రాల్లో నేను నటించాను. ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’, ‘అజ్ఞాతవాసి’ల్లో నటించలేదు. ఈ ఏడాది మా కాంబోలో సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. రాజకీయపరంగా కొన్ని అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు.. కానీ మేమిద్దరం ఎప్పుడూ ఒకేలా ఉంటాం. ఆయన్ని కలిసి దాదాపు ఏడాదిన్నర అవుతోంది. రాజకీయాలు, కరోనా కారణంగా ఆయన్ని కలవలేకపోయాను. కాకపోతే, మధ్యలో ఒకసారి ఆయన్ని కలవడానికి వెళ్లాను. అప్పుడు ఆయన అక్కడ లేరు. పుణె వెళ్లారని తెలిసి వచ్చేశాను. ఇటీవల మేమిద్దరం కలిసినప్పుడు.. ‘ఎలా ఉన్నావు?’ అని అడిగారు’’ అని ఆలీ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.