Ali: ‘ఆలీతో సరదాగా’కు పవన్ కల్యాణ్ కచ్చితంగా వస్తారు..: ఆలీ
‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ అతిథిగా ఎప్పుడు వస్తారనే విషయంపై ఆలీ స్పందించారు. అలాగే ఆ కార్యక్రమంలో తనకు ఇష్టమైన ఎపిసోడ్‌ల గురించి మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: కమెడియన్ ఆలీ, హీరో పవన్ కల్యాణ్ మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని బహిరంగంగా ఇద్దరూ చాలా సార్లు చెప్పారు. ఈటీవీలో ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ఎప్పుడు వస్తారు? ఇటీవల పవన్ నటించిన రెండు సినిమాల్లో ఆలీ ఎందుకు లేరు? అనే విషయాలపై ఆలీ క్లారిటీ ఇచ్చారు. ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలపై స్పందించారు.
‘‘ఆలీతో సరదాగా కార్యక్రమంలో గాయకుడు బాలు గారితో చేసిన ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. ఆయన నన్ను కొడుకులాగా భావించేవారు. ఆయన మరణించారని తెలిసినప్పుడు తట్టుకోలేకపోయాను. అలాగే పూరీ జగన్నాథ్, వి.వి వినాయక్, తాజాగా అల్లు అరవింద్ ఎపిసోడ్‌లు నాకు నచ్చాయి. పవన్ కల్యాణ్‌గారు కూడా ఈ కార్యక్రమానికి కచ్చితంగా వస్తారు. వస్తా అని చెప్పారు కూడా. ప్రస్తుతం ఆయన బిజీగా ఉన్నారు’’ అని ఆలీ చెప్పారు.
ఇక పవన్ కల్యాణ్ నటించిన బీమ్లా నాయక్, వకీల్ సాబ్ చిత్రాల్లో తాను ఎందుకు నటించలేదు అనే విషయం పై మాట్లాడుతూ..‘‘ఆ రెండు సినిమాలు చాలా సీరియస్‌వి. వాటిలో కామెడీ ఏమీ ఉండదు. నేనే కాదు.. అసలు ఏ కమెడియన్ వాటిల్లో లేరు. పవన్ కల్యాణ్ రానున్న సినిమాల్లో కామెడీ ఉంటే.. నన్ను కచ్చితంగా పిలుస్తారు’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sapta Sagaralu Dhaati: విడుదలైన వారంలోపే ఓటీటీలోకి.. ‘సప్త సాగరాలు దాటి’
-
Justin Trudeau : నిజ్జర్ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్ ట్రూడో
-
Asian Games: షూటింగ్లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్‌లో రజతం
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. 19,550 ఎగువన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు