Alia Bhatt: అందుకే పెళ్లి చీరలో వెళ్లి అవార్డు తీసుకున్నా..: అలియా భట్‌

జాతీయ అవార్డు వేడుకకు పెళ్లి చీరలో వెళ్లడానికి గల కారణాన్ని అలియా భట్ (Alia Bhatt)వివరించారు. ఆ చీరతో అవార్డు తీసుకోవడం మరింత గౌరవంగా అనిపించిందన్నారు.

Published : 06 Nov 2023 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలియా భట్ (Alia Bhatt)ఉత్తమ నటిగా ఇటీవల అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ వేడుకకు ఆమె పెళ్లి చీరలో వచ్చి అవార్డును తీసుకోని అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అలియా ఆ చీర కట్టుకోవడానికి గల కారణాన్ని వివరించింది. అంత గొప్ప అవార్డును తీసుకోవడానికి పెళ్లి చీరలో వెళ్లడం మరింత గౌరవంగా అనిపించినట్లు వెల్లడించింది.

‘ఏదైనా పెద్ద ఈవెంట్స్‌ ఉన్నప్పుడు నాకు మొదట ఆ చీరే గుర్తొస్తుంది. అది కట్టుకోగానే నాకు తెలియని ఆనందం వేస్తుంది. ఇక వేరే ఆభరణాలు అవసరం లేదేమో అనిపిస్తుంది. సాధారణంగా అందరూ ఇలాంటి ప్రత్యేక క్షణాల్లో ముందెన్నడూ చూడని దుస్తులు ధరించాలనుకుంటారు. కానీ, నేను దాన్ని మార్చాలనుకున్నా. అందుకే పెళ్లి చీరలో వెళ్లి అవార్డును తీసుకున్నా. అయినా, వేసుకునే డ్రెస్‌లు కాదు ముఖ్యం వాటిని ధరించిన మనిషి ముఖ్యం ’అని చెప్పారు.

దీపావళి వేడుకలు షురూ... ఒకేచోట కలిసిన స్టార్స్‌

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన పెళ్లిపై వచ్చిన ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. ‘మొదట్లో నేను ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకొని దాని గురించి ఆలోచించేదాన్ని. కానీ, ఇప్పుడు పూర్తిగా మారాను. ఏ విషయం గురించి కంప్లైంట్ చేయకూడదనుకుంటున్నా. నాపై వచ్చే ఎన్నో ట్రోల్స్ నా కంటపడతాయి. మనం కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు అలాంటి అసహ్యకరమైన విషయాలను చదవకూడదు. ఇక నన్ను ట్రోల్‌ చేసేవాళ్లు కూడా నా ప్రేక్షకులే. వాళ్లు నా చిత్రాలు చూసే నన్ను ట్రోల్‌ చేస్తారు. అందుకే నేను వాటిపై స్పందించను’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని