Muthyala Subbaiah: నెల రోజులు చేసిన తర్వాత దర్శకుడిగా మానేయమన్నారు!
రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మా అన్నయ్య’ చిత్రానికి నెల రోజుల పాటు దర్శకుడిగా
హైదరాబాద్: రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘మా అన్నయ్య’ చిత్రానికి నెల రోజుల పాటు దర్శకుడిగా పనిచేసిన తర్వాత ‘సుబ్బయ్యగారు ఈ సినిమా మానేయండి’ అన్నారని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య (Muthyala Subbaiah). ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘మూడు ముళ్ల బంధం’ చిత్రంతో దర్శకుడిగా మారానని చెప్పిన ఆయన అప్పటికే జీవితంలో మూడు ముళ్లు వేశానని అది పెద్ద ఫ్లాప్ అని సరదాగా వ్యాఖ్యానించారు. తొందరపడి కోయిల ముందే కూసిందని, తాను త్వరగా పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. ఎడిటర్ మోహన్ మలయాళంలో ‘హిట్లర్’ చూసి, ‘చిరంజీవితో మీరే చేయాలి’ అన్నారని, అది తన అదృష్టమన్నారు. ఇక తన కెరీర్‌లో రాజశేఖర్‌తో ఎక్కువ సినిమాలు చేశానని, దాదాపు అన్నీ ఘన విజయం సాధించాయని చెప్పారు. ‘ఏదో సినిమా విషయంలో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోదామనుకున్నారా..?’ అని ప్రశ్నించగా.. ‘జగపతిబాబు హీరో, ఇంద్రజ హీరోయిన్. నేనేమో సౌందర్య కరెక్ట్ అనుకున్నా. కానీ, ఆయన ఇంద్రజను తీసుకున్నారు. ఆ విషయంలో బాధ కలిగింది’ అని ముత్యాల సుబ్బయ్య పేర్కొన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీ విడిచి వెళ్లిపోదామనుకున్నాన్నట్లు చెప్పారు. ఈ పూర్తి ఎపిసోడ్ సెప్టెంబరు 19న ఈటీవీలో ప్రసారం కానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం