హీరోల ఎంపిక.. చాలా కష్టం: రీతూవర్మ

‘పెళ్లి చూపులు’తో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నిన్నిలా నిన్నిలా’...

Updated : 04 Mar 2021 14:57 IST

హైదరాబాద్‌: ‘పెళ్లి చూపులు’తో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘నిన్నిలా నిన్నిలా’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రీతూవర్మ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. తన ఇష్టాయిష్టాలను అభిమానులతో పంచుకున్నారు.

‘నిన్నిలా నిన్నిలా’ విజయంపై ఎంతోమంది నుంచి వస్తోన్న ట్వీట్లు, మెస్సేజ్‌లు చూస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం తనకి వంట చేయడం వచ్చని.. టీతోపాటు థాయ్‌, చైనీస్‌, జపనీస్‌ వంటకాలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తానని రీతూ వివరించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌.. ‘ఇప్పటి వరకూ మీరు నటించిన హీరోల్లో మీ అభిమాన నటుడు ఎవరు?’ అని ప్రశ్నించగా.. ‘విభిన్నమైన కారణాలతో నా తోటి హీరోలందరూ నాకిష్టమే. వాళ్లందరిలో ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలంటే కష్టం. అలాంటి అద్భుతమైన నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అని రీతూ వివరించారు. అంతేకాకుండా చెన్నైలోని కాఫీ షాప్స్‌కు వెళ్లడానికి తాను ఎక్కువ ఆసక్తి చూపిస్తానని నటి అన్నారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని