ఎట్టకేలకు రవితేజ ‘క్రాక్‌’ విడుదల

మాస్‌ మహారాజ్‌ రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్రాక్‌’ ఎట్టకేలకు విడుదలైంది. ఈ చిత్రం ఈరోజు ఉదయం విడుదల కావాల్సి ఉంది. ఫైనాన్షియర్‌, నిర్మాతకు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కారణంగా విడుదల నిలిచిపోయింది. అయితే..  సమస్య పరిష్కారం కావడంతో సాయంత్రం 6 గంటలకు చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించారు.

Updated : 10 Jan 2021 16:13 IST

హైదరాబాద్‌: మాస్‌ మహారాజ్‌ రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘క్రాక్‌’ ఎట్టకేలకు విడుదలయింది. షెడ్యూల్‌ ప్రకారం శనివారం ఉదయం విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్షియర్‌, నిర్మాతకు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కారణంగా ప్రదర్శన నిలిచిపోయింది. అయితే.. సమస్య పరిష్కారం కావడంతో చిత్రం విడులైంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత కాస్త ముందుగానే అంటే.. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసురానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్‌ నటించింది. తమన్‌ స్వరాలు సమకూర్చారు. బి.మధు నిర్మాత.

ఇదిలా ఉండగా.. రవితేజ అభిమానులు ఉదయం నుంచి థియేటర్ల వద్ద పడిగాపులుకాచారు. ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో వాళ్లంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. ప్రకటించిన అన్ని థియేటర్లలో కాకుండా కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదలయినట్లు తెలుస్తోంది. కాగా ఉదయం నుంచి ఓపికగా ఎదురుచూడటంతో పాటు సినిమా చూసేందుకు థియేటర్లకు తరలివస్తున్న అభిమానులకు హీరో రవితేజ సామాజిక మాధ్యమాల వేదికగా ధన్యవాదాలు తెలిపారు. 

ఇవీ చదవండి!

థియేటర్లోకి ‘టక్‌ జగదీష్‌’ఎప్పుడంటే?




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు