Hanu-Man: ‘హనుమాన్‌’ చారిత్రక విజయం: కేంద్ర హోం మంతి అమిత్‌షా

హనుమాన్‌ చిత్ర బృందాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందించారు.

Published : 12 Mar 2024 20:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanu-Man). సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై పలువు స్టార్ నటీనటులు, ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit shah) చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా చారిత్రక విజయం సాధించిందన్నారు.  ఈసందర్భంగా అమిత్‌షాకు హనుమంతుని విగ్రహాన్ని బహుమతిగా అందించారు టీం సభ్యులు. రికార్డులు బ్రేక్‌ చేసిన ఈ సినిమాలో హనుమంతు పాత్రలో నటించి మెప్పించారు తేజ. ఇందుకుగాను ‘మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా’ గామా అవార్డు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రూపొందించనున్నారు.

తేజ ఇటీవల ఇచ్చిన ఇంటర్య్వూలో తాను చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు. ‘‘నేను నటించేందుకు కథలు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని వినోదాత్మక కథలు పరిశీలనలో ఉన్నాయి. వాటి వివరాలు వెల్లడించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా’’ అని తేజ పేర్కొన్నారు. మరోవైపు తేజ టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారన్న వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నిర్మాతతో తేజ కలిసి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఈ వార్తలు నిజమేనంటూ టాక్‌ వినిపిస్తుంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా నాగ్‌అశ్విన్‌ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని