Amitabh Bachchan: ‘కల్కి’ టైటిల్‌ రిలీజ్‌.. అందుకే పాల్గొనలేదు: అమితాబ్‌ బచ్చన్‌

‘కల్కి’ టైటిల్‌, గ్లింప్స్‌ రిలీజ్‌ వేడుకలో పాల్గొనకపోవడంపై తాజాగా అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) స్పందించారు. కారణాన్ని తెలియజేస్తూ తాజాగా బ్లాగ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. 

Published : 24 Jul 2023 01:36 IST

ముంబయి: ప్రభాస్‌ (Prabhas) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki) టైటిల్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) స్పందించారు. వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ వేడుకకు హాజరు కాలేకపోయానని అన్నారు. ‘‘చిత్రబృందంలోని సభ్యులతోపాటు ‘ప్రాజెక్ట్‌ కె’ టైటిల్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఇదొక గ్రేట్‌ మూమెంట్‌. ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ వేడుకకు రమ్మని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నన్నెంతగానో కోరారు. వర్క్‌, వైద్య పరిమితుల కారణంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు నేను దూరం కావాల్సి వస్తుంది. కానీ, నేను ఒక విషయం మాత్రం తప్పక చెబుతా. ‘కల్కి 2898 ఏడీ’ ఫస్ట్‌ లుక్‌ చాలా బాగుంది. స్టైల్‌, మ్యూజిక్‌, ఫ్రేమ్స్‌.. ఇలా ప్రతీది అద్భుతంగా ఉన్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

స్విమ్‌ సూట్‌లో రకుల్‌.. కంగన ఇంట శుభకార్యం.. నజ్రియా స్లీప్‌ మోడ్‌

ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. దీపికా పదుకొణె కథానాయిక. కమల్‌ హాసన్‌ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్థాయిలో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇటీవల అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con) వేడుకలో చిత్రబృందం పాల్గొని ఈ సినిమా టైటిల్‌, గ్లింప్స్‌ను రిలీజ్‌  చేసింది. ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ను ఇప్పటివరకూ 17 మిలియన్ల మంది వీక్షించారు. విజువల్‌ వండర్‌గా ఉందని సినీ ప్రియులు ప్రశంసలు కురిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని