Amitabh Bachchan: భావోద్వేగంతో అమితాబ్ కంటతడి.. కారణమిదే!

బాలీవుడ్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)ఓ ప్రోగ్రామ్‌లో కంటతడి పెట్టుకున్నారు. కార్యక్రమ నిర్వాహకులు ఆయన పుట్టినరోజును జరపడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

Updated : 10 Oct 2023 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎనిమిది పదుల వయసులో కూడా నేటి తరం యంగ్‌ హీరోలతో పోటీపడుతూ నటిస్తున్నారు అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan). ఒకవైపు వరుస సినిమాలతో అలరిస్తూనే మరోవైపు టెలివిజన్‌లో పలు కార్యక్రమాలతో ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన ఓ ప్రోగ్రామ్‌లో భావోద్వేగంతో కంటతడి పెట్టారు.

అమితాబ్‌ ఎన్నో ఏళ్లుగా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని 15వ సీజన్‌ ప్రసారమవుతోంది. తాజాగా ఈ ప్రోగ్రామ్‌ నిర్వాహకులు అమితాబ్‌ పుట్టినరోజును జరిపారు. అక్టోబర్‌11న ఆయన పుట్టినరోజు కావడంతో నిర్వాహకులు సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేశారు. ఇండస్ట్రీలోని ప్రముఖులతో ఆయనకు శుభాకాంక్షలు చెప్పించారు. చిరంజీవి, విద్యాబాలన్‌, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీలతో విషెస్‌ చెప్పించారు. దీంతో ఒక్కసారిగా బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఇంకా ఎంత ఏడిపిస్తారు. ఈ సెట్‌లో నా పుట్టినరోజు వేడుక నిర్వహించడం నాకు ఎంతో ప్రత్యేకం’ అంటూ ఆనందంతో కంటతడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దీని ప్రోమో వైరల్‌ అవుతోంది. 

మొదటి సినిమాకే ఈ కాన్ఫిడెన్స్‌ ఏంటి?సుమ కొడుకుని పొగడ్తలతో ముంచెత్తిన నాని

ఇక అమితాబ్‌ బచ్చన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki)లో ఆయన కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌లో ఆయన కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తోన్న  ‘తలైవా 170’ (Thalaivar 170)లోనూ  అమితాబ్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ ప్రకటించి.. అమితాబ్‌ పోస్టర్‌ను విడుదల చేసింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని