Thank You Brother review:రివ్యూ: థ్యాంక్ యు బ్రదర్!
అనసూయ కీలక పాత్రలో నటించిన ‘థ్యాంక్ యు బ్రదర్’ ఎలా ఉందంటే?
చిత్రం: థ్యాంక్ యు బ్రదర్!; నటీనటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అనిశ్ కురువిల్ల, మోనికారెడ్డి, వైవా హర్ష, అర్చనా అనంత్, అన్నపూర్ణమ్మ; సంగీతం: గుణ బాలసుబ్రమణియన్; సినిమాటోగ్రఫీ: సురేశ్ రగుతు; ఎడిటింగ్: ఉదయ్, వెంకట్; ఆర్ట్: పురుషోత్తమ్ ప్రేమ్; కథ: రమేశ్ రాపర్తి, నియీ అఖిన్మోలయాన్, మోరిస్ కె.శశి; నిర్మాత: మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారకనాథ్ బొమ్మిరెడ్డి,; దర్శకత్వం: రమేశ్ రాపర్తి; విడుదల: ఆహా
గతేడాది కరోనా కారణంగా థియేటర్లు మూతబడటంతో చాలా సినిమాలు ఓటీటీని పలకరించాయి. ఈ ఏడాది అంతా బాగుందనే సరికి మరోసారి కరోనా విజృంభించడంతో థియేటర్లు మూసివేయక తప్పలేదు. దీంతో విడుదలకు సిద్ధమైన చిత్రాలు మళ్లీ ఓటీటీ బాటపడుతున్నాయి. అందులో భాగంగానే ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. బుల్లితెర వ్యాఖ్యాత అనసూయ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్ర కథేంటి? అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
కథేంటంటే: అభి(విరాజ్ అశ్విన్) తన తండ్రి స్నేహితుడు(సమీర్)తో కలిసి వ్యాపార భాగస్వామిగా చేరతానని కోరడానికి గోల్డ్‌ఫిష్ అపార్ట్‌మెంట్‌కు వస్తాడు. మరోవైపు పెళ్లయిన కొన్ని రోజులకే భర్త(ఆదర్శ్ బాలకృష్ణ) చనిపోవడంతో అతను పనిచేసే కంపెనీ నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రియ(అనసయా భరద్వాజ్) కూడా అదే అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. పైగా ఆమె నిండు గర్భిణి. అక్కడి నుంచి తిరిగి వెళ్లే క్రమంలో ఇద్దరూ ఒకేసారి లిఫ్ట్ ఎక్కుతారు. సడెన్‌గా లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి ఆగిపోతుంది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రియకు నొప్పులు ప్రారంభమవుతాయి. అలాంటి సమయంలో అభి ఏం చేశాడు? లిఫ్ట్‌లో వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది తెరపై చూడాల్సిందే!
ఎలా ఉందంటే: గత కొంతకాలంగా యువ దర్శకులు సరికొత్త ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. దీంతో కథాబలమున్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాంటి కోవలో వచ్చిందే ‘థ్యాంక్ యు బ్రదర్’. సాధారణంగా లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు సడెన్‌గా కరెంట్ పోతే అది పనిచేసే వరకూ అందులో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ తెలియని ఆందోళన నెలకొంటుంది. అదే నిండు గర్భిణి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే, అదే సమయంలో ఆమెకు నొప్పులు మొదలైతే, ఇదే చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌ను తీసుకుని కథగా మలుచుకున్నాడు దర్శకుడు రమేశ్. ఇలాంటి సినిమాలకు బిగిసడలని కథనం తోడైతే ఆ సినిమా హిట్టయినట్టే. ఈ విషయంలో దర్శకుడు రమేశ్ కొంత వరకే సఫలమయ్యాడు.
ప్రథమార్ధమంతా అభి, ప్రియల నేపథ్యం చూపించేందుకు సమయం తీసుకున్నాడు. ఈ సన్నివేశాలు కాస్త విసుగు తెప్పిస్తాయి. ముఖ్యంగా అభి ఎపిసోడ్ తరహా సన్నివేశాలు చాలా సినిమాల్లో చూశాం. అభి, ప్రియలు లిఫ్ట్‌లో ఇరుక్కున్న తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకూ అభి, ప్రియల ఫ్లాష్‌బాక్ అంతా భరించాల్సిందే. లాక్డౌన్ కారణంగా ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ద్వితీయార్ధం అంతా లిఫ్ట్‌లో ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో సాగుతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే: ఒకవైపు, యాంకరింగ్ ప్రత్యేక గీతాలు, అతిథి పాత్రల్లో మెరుస్తూనే కథా బలమున్న చిన్న చిత్రాల్లో అనసూయ నటిస్తూ మెప్పిస్తోంది. ఈ చిత్రంలో నిండు గర్భిణిగా ప్రియ పాత్రలో అనసూయ ఒదిగిపోయింది. లిఫ్ట్‌లో పురుటినొప్పులతో బాధపడే సన్నివేశాలు భావోద్వేగంగా ఉన్నాయి. యువ కథానాయకుడు విరాజ్ పర్వాలేదు.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికవర్గం పనితీరు బాగుంది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా లిఫ్ట్ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు మరింత బలం తీసుకొచ్చింది. సినిమా నిడివి తక్కువే. అయినా ఇంకా కత్తెర వేయాల్సిన అవసరం ఉంది. దర్శకుడు రమేశ్ ఎంచుకున్న పాయింట్ కొత్తదే. అయితే, దాన్ని ఉత్కంఠ భరితంగా తీర్చిదిద్దడంలో తడబడ్డాడు. అభి, ప్రియల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను త్వరగా ముగించి, అసలు పాయింట్ అయిన లిఫ్ట్ సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో థ్రిల్లర్‌గా అలరించేది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి, వీకెండ్లో కాలక్షేపం కోసం ‘థ్యాంక్ యు బ్రదర్’ చూడొచ్చు.
బలాలు | బలహీనతలు |
+ ఎంచుకున్న పాయింట్ | - ప్రథమార్ధం |
+ ద్వితీయార్ధం | - కథ, కథనాలు |
+ సాంకేతిక బృందం పనితీరు |
చివరిగా: బ్రదర్.. ఇంకాస్త ‘లిఫ్ట్’ చేయాల్సింది!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్‌బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?