Anasuya: ‘బేబీ’.. నాకు తెలిసిన వాళ్ల కథలా ఉంది: అనసూయ

‘బేబీ’ (Baby) చిత్రాన్ని ఉద్దేశిస్తూ నటి అనసూయ (Anasuya) తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. ట్రైలర్‌ చూస్తుంటే తనకు తెలిసిన వాళ్ల కథలా ఉందని ఆమె అన్నారు.

Published : 10 Jul 2023 14:02 IST

హైదరాబాద్‌: ఆనంద్‌ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘బేబీ’ (Baby). సాయి రాజేశ్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈసినిమా ట్రైలర్‌పై తాజాగా నటి అనసూయ (Anasuya) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటీనటుల సంభాషణలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయన్నారు.

‘‘మీ సెలబ్రేషన్స్‌లో ఆలస్యంగా జాయిన్‌ అయ్యాను. సాయిరాజేశ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. ట్రైలర్‌ నాకెంతో నచ్చేసింది. ఒరిజినాలిటీ, హృదయాన్ని తాకేలా ఉన్న మాటలు చూస్తుంటే.. నాకు తెలిసిన వాళ్ల కథ లాగే అనిపిస్తుంది. ఈసినిమా చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఆనంద్‌ చాలా ఇంటెన్స్‌గా నటించారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించి ఎస్‌కేఎన్‌ నిర్మాతగా ఈ స్థాయికి వచ్చారు. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’’ అని ఆమె రాసుకొచ్చారు. జులై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని