మహేశ్‌బాబుతో సినిమా చేయడానికి సిద్ధం: అనిల్‌ రావిపూడి

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుతో మరోసారి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.

Published : 01 May 2022 01:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబుతో మరోసారి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు. త్వరలోనే ఆయన కోసం ప్రత్యేకంగా ఓ కథను సిద్ధం చేసి, స్క్రిప్ట్‌ కూడా పూర్తి చేస్తానని అన్నారు. ఓ ఆంగ్ల న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ‘మహేశ్‌సర్‌ మిషన్‌ త్వరలోనే మొదలు పెడతా. ఆయన ప్రస్తుతం ఒప్పుకొన్న ప్రాజెక్టులన్నీ పూర్తయిన వెంటనే మా మూవీ మొదలు పెడతాం. నేను సిద్ధంగా ఉంటా’ అని అనిల్‌ రావిపూడి తెలిపారు.

ప్రస్తుతం అనిల్‌ ‘ఎఫ్‌3’కి తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  అదే విధంగా బాలకృష్ణతో చేయబోయే సినిమాపై అనిల్‌ రావిపూడి స్పందించారు. ‘బాలకృష్ణ సర్‌తో చేయబోయే సినిమా నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఆ కథలో ఒక సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌ఉంది. అదొక డిఫరెంట్‌ జానర్‌’అని అనిల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని