anushka shetty: అప్పుడే మొదలైంది

కొన్నేళ్లుగా అనుష్క కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. నిదానమే ప్రధానం అన్నట్లు ఒకటి తర్వాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఆమె గతేడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల్ని మురిపించింది.

Updated : 09 Feb 2024 09:48 IST

కొన్నేళ్లుగా అనుష్క కథల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోంది. నిదానమే ప్రధానం అన్నట్లు ఒకటి తర్వాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఆమె గతేడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల్ని మురిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకు మరో కొత్త కబురు వినిపించలేదు. అయితే ఆమె ఇప్పటికే నిశ్శబ్దంగా తెలుగులో ఓ సినిమాని పట్టాలెక్కించినట్లు తెలిసింది. ఇది ప్రముఖ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్నట్లు సమాచారం. దీన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్‌ శైలికి తగ్గ ఓ బలమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని.. సవాల్‌తో కూడిన పాత్రను స్వీటీ పోషిస్తోందని ప్రచారం వినిపిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అనుష్క ప్రస్తుతం మలయాళంలో ‘కథనార్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని