Bhagwant Kesari: కేసరిని ఢీకొట్టే రాహుల్‌ సంఘ్వి

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 16 Aug 2023 13:56 IST

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌.. రాహుల్‌ సంఘ్వి అనే పాత్రలో నటిస్తున్నారు. ఆయనపై సన్నివేశాల చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా అర్జున్‌ రాంపాల్‌.. ‘భగవంత్‌ కేసరి’ అనుభవాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ‘‘తొలి తెలుగు సినిమా కావడంతో మొదట భయపడ్డా. కానీ పెద్దన్నయ్యలాంటి బాలకృష్ణ ఉత్సాహం, ప్రేమ... తమ్ముడిలాంటి అనిల్‌ రావిపూడి ప్రేమ కారణంగా చిత్రీకరణ చాలా బాగా సాగింది’’ అంటూ వ్యాఖ్య చేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని