Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్‌ నష్టపోతోంది: అరుణ్‌ విజయ్‌

నిర్మాతల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని  నటుడు అరుణ్ విజయ్  ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వారం వరుసగా ఐదారు సినిమాలు విడుదల చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదన్నారు.

Published : 12 Aug 2022 01:52 IST

హైదరాబాద్‌: నిర్మాతల మధ్య ఐక్యత లేకపోవడం కారణంగా తమిళ సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని నటుడు అరుణ్ విజయ్ (Arun Vijay) ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వారం వరుసగా ఐదారు సినిమాలు విడుదల చేయడం వల్ల నిర్మాతలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ విషయంలో టాలీవుడ్‌ నిర్మాతలంతా ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సినిమా పైరసీ నేపథ్యంలో అరుణ్‌ హీరోగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘తమిళ్‌ రాకర్స్‌’ (Tamil Rockerz). అరివళగన్‌ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఆగస్టు 19న నుంచి ఓటీటీ ‘సోనీ లివ్‌’లో (SonyLiv) స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అరుణ్ విజయ్ ‘ఈటీవీ’తో (ETV) ప్రత్యేకంగా ముచ్చటించారు. సినీ పరిశ్రమకు శాపంగా మారిన పైరసీని ఎలా కట్టడి చేయొచ్చో తమ సిరీస్‌లో చూపించామని తెలిపిన విజయ్.. తన సోదరిమణులతో రాఖీ పండుగ ఎలా జరుపుకొంటారో వివరించారు. ‘బ్రూస్‌ లీ’, ‘సాహో’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అరుణ్‌ పంచుకున్న మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చూడండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని