Sarpatta: అమెజాన్‌ ప్రైమ్‌లో ఆర్య చిత్రం

కరోనా క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమా షూటింగ్‌లు మొదలైనా ఇంకా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో

Updated : 08 Jul 2021 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా క్లిష్ట పరిస్థితులను దాటుకుని సినిమా షూటింగ్‌లు మొదలైనా ఇంకా థియేటర్లు తెరుచుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ వేదికగా వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అలా త్వరలో రాబోతున్న మరో భారీ చిత్రం ‘సార్‌పట్ట’. ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలతో తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకుల్నీ మెప్పించిన దర్శకుడు పా.రంజిత్‌. ఆయన దర్శకత్వంలో ఆర్య కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సార్‌పట్ట’. బాక్సింగ్‌ ఆట నేపథ్యంలో పీరియాడికల్‌ మూవీగా దీన్ని తీర్చిదిద్దారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉన్నా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు జులై 22న తమిళ, తెలుగు భాషల్లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు నటుడు ఆర్య ఎంతో కష్టపడ్డారు. ఆరుపలకల దేహం కోసం తీవ్రంగా శ్రమించారు. ఆయనతో పాటు బాక్సర్‌లుగా నటించిన ఇతర నటులు సైతం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘సార్‌పట్ట’ ప్రపంచాన్ని చూడండి అంటూ అప్పట్లో విడుదల చేసిన వీడియో విశేషంగా అలరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని