Bollywood: నాకు హార్ట్‌ ఎటాక్ రాలేదు.. బాగానే ఉన్నా..: సినీ నిర్మాత

తన ఆరోగ్యంపై వస్తోన్న రూమర్స్‌ను బాలీవుడ్‌ సినీ నిర్మాత ఖండించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్వయంగా వీడియో విడుదల చేశారు.

Published : 02 Oct 2023 15:52 IST

ముంబయి: తన ఆరోగ్యం గురించి వస్తోన్న రూమర్స్‌పై స్పందించారు బాలీవుడ్‌ నిర్మాత, సెన్సార్‌ బోర్డు మాజీ సభ్యుడు అశోక్ పండిట్ (Ashoke Pandit). ఆయనకు హార్ట్‌ ఎటాక్ వచ్చిందని ఆసుపత్రిలో చేరారంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. అలాగే కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తోన్న విశాల్, సెన్సార్‌ బోర్డు విషయంపై కూడా ఆయన స్పందించారు.

‘‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. కొన్ని రోజుల నుంచి నా ఆరోగ్యంపై ఎన్నో రూమర్స్‌ వస్తున్నాయి. అవి వాస్తవం కాదు. నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దు. ఈ ప్రచారం వల్ల ఆందోళనతో ఎంతో మంది నాకు ఫోన్‌ చేశారు. వాళ్లకు ధన్యవాదాలు. అలాగే, దీన్ని ప్రచారం చేసిన వారికి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇక సెన్సార్‌ బోర్డు ఉద్యోగులపై విశాల్ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ఈ విషయంపై సీబీఐ విచారణకు మేం డిమాండ్‌ చేస్తున్నాం. డబ్బులు తీసుకున్న వ్యక్తి సెన్సార్‌బోర్డు ఉద్యోగి కాదు. కాబట్టి ఎవరికి డబ్బులు ఇచ్చారనే దానిపై విచారణ జరపాలి’ అని అన్నారు. 

‘సలార్‌’ ఆ సినిమాకు రీమేక్‌..? ఈ రూమర్‌కు అసలు కారణమిదే!

ఇక ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) సినిమా హిందీ వెర్షన్‌ సెన్సార్‌ విషయంలో తాను లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్‌ (Vishal) ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సార్‌ కోసం దాదాపు రూ.6.5 లక్షలు లంచంగా చెల్లించానని ఆయన తెలిపారు. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని