Oscars 2023: ఆస్కార్స్ 2023 వీక్షకులు ఎంతమందంటే? టాప్-1లో ఎన్టీఆర్!
NTR: ఆస్కార్ వేడుక సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా అత్యధికసార్లు ప్రస్తావించిన నటుల జాబితాలో ఎన్టీఆర్ టాప్-1లో నిలిచారు.
ఇంటర్నెట్‌డెస్క్: 95వ ఆస్కార్ అవార్డుల (oscars 2023) కార్యక్రమం అంగరంగ వైభవంగా ముగిసింది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాలు అవార్డులతో మురిశాయి. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 18.7 మిలియన్ మంది వీక్షించారట. ఈ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఏబీసీ ఈ మేరకు ప్రాథమిక గణాంకాలను వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే వీక్షకుల సంఖ్య 12శాతం పెరిగింది. అయితే, గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువే. ఆస్కార్ పురస్కారాల సంబరం మొదలైన తర్వాత హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌లలో ప్రసారమైన ‘ది లాస్ట్ ఆఫ్ అజ్’ ఫినాలేను 8.2మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం.
గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ ‘సూపర్ బౌల్’ తర్వాత అత్యధికమంది వీక్షించే కార్యక్రమం ఆస్కార్ వేడుక. 2018 వరకూ 30 మిలియన్ వ్యూవర్స్‌కు ఏమాత్రం తగ్గేది కాదు. అయితే, 2014 నుంచి ఈ వేడుకను చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. 2021లో 9.85 మిలియన్ వ్యూవర్స్‌కు పడిపోయింది. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఆస్కార్ వేడుకలను వీక్షించే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక్క సెలబ్రిటీ కూడా ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని చూడాలని అభిమానులకు విజ్ఞప్తి చేయకపోవడం శోచనీయమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ చిత్రం రేసులో రెండు బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించిన ‘టాప్‌గన్: మావెరిక్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు ఉన్నాయి. ఆ చిత్ర బృందాలు, నటీనటులు ఎవరూ కనీసం ప్రచారం కూడా చేయలేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రంగా అవార్డుతో సహా ఏడు ఆస్కార్లను తన ఖాతాలో వేసుకుంది.
టాప్-1 ఎన్టీఆర్
ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియా, న్యూస్ మీడియాలో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో ఎన్టీఆర్ (NTR) నం.1 స్థానంలో నిలిచినట్లు సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్ క్విడ్ తెలిపింది. ఆయన తర్వాత రామ్‌చరణ్ ఉన్నారు. ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఆ తర్వాత ‘ది ఎలిఫెంట్ ‘విస్పరర్స్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనియా 1985’ చిత్రాలు ఉన్నాయి. ఇక నటీమణుల విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్లు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్‌పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక