Rajadhani Files: అర్ధంతరంగా ‘రాజధాని ఫైల్స్‌’ నిలిపివేత..

‘రాజధాని ఫైల్స్‌’ (Rajadhani Files) సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్ధంతరంగా నిలిపివేశారు.

Updated : 15 Feb 2024 14:23 IST

అమరావతి: ‘రాజధాని ఫైల్స్‌’ (Rajadhani Files) సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్‌ మాల్‌లో అర్ధంతరంగా నిలిపివేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా.. ఆర్డర్‌ కాపీని చూపించాలని పట్టుబట్టారు.

మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు. రామకృష్ణ థియేటర్‌ వద్ద తెదేపా నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని