chatrapathi: ‘ఛత్రపతి’గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (bellamkonda sai srinivas) బీటౌన్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది.
ముంబయి: ప్రభాస్ - రాజమౌళి కాంబోలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘ఛత్రపతి’ (chatrapathi). తాజాగా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. వేసవి కానుకగా మే 12న దీన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ‘ఛత్రపతి’ టైటిల్ పోస్టర్‌ని షేర్ చేసింది. కండలు తిరిగిన దేహంతో సాయిశ్రీనివాస్ వెనుక నుంచి కనిపించాడు. ఇదొక యాక్షన్ సీక్వెన్స్‌లోని షాట్‌లా కనిపిస్తుంది.
‘అల్లుడు అదుర్స్’ తర్వాత సాయి శ్రీనివాస్ (sai srinivas) చేస్తోన్న చిత్రమిది. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. హిందీ ప్రేక్షకులు తన చిత్రాలపై చూపిస్తోన్న ప్రేమను దృష్టిలో పెట్టుకుని.. వారిని మరింతగా అలరించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లు గతంలో సాయి శ్రీనివాస్ వెల్లడించారు. పెన్ స్టూడియోస్ పతాకంపై ఇది నిర్మితమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ekyc: గల్ఫ్ వలసదారుల్లో ఈకేవైసీ గుబులు
-
Asifabad: బడికెళ్లాలంటే.. ఈత రావాలి
-
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కాంపోజిట్ తెలుగు కొనసాగింపు
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!