Amitabh Bachchan: నా ఎత్తు కారణంగా వాళ్లు అలా చేశారు..: అమితాబ్ బచ్చన్‌

అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) తాజాగా ఓ చిన్నారితో కలిసి సరదాగా మాట్లాడారు. ఆయన స్కూల్‌ డేస్‌ను గుర్తుతెచ్చుకున్నారు.

Published : 23 Dec 2022 16:47 IST

హైదరాబాద్‌: నేటి యువ నటులతో పోటీ పడి నటిస్తుంటారు అమితాబ్‌ బచ్చన్(Amitabh Bachchan)‌. సినిమాల్లోనే కాకుండా వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ కార్యక్రమాల్లోనూ కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. దేనికైనా తనదైన శైలిలో స్పందించే ఈ హీరో తాజాగా ఓ చిన్నారితో జరిపిన సరదా సంభాషణ నెట్టింట వైరల్‌ అవుతోంది.

టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఓ ప్రముఖ కార్యక్రమానికి అమితాబ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అందులో చిన్నపిల్లలు పాల్గొన్నారు. వారితో కలిసి సందడి చేసిన అమితాబ్‌ ఓ చిన్నారితో సరదాగా మాట్లాడారు. ఆ చిన్నారి తన రిపోర్టు కార్డులో ఎత్తు తక్కువ ఉన్న వాళ్లంటే తనకు ఇష్టం లేదని రాసుకుంది. దీనిపై  మాట్లాడిన అమితాబ్‌ తన చిన్నప్పటి రోజులు గుర్తుచేసుకున్నారు. తాను ఎత్తుగా ఉన్న కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘నేను చదువుకున్న స్కూల్‌లో బాక్సింగ్‌ కచ్చితంగా నేర్చుకోవాలి. నేను ఎత్తు ఎక్కువగా ఉన్నానని.. నన్ను సీనియర్స్‌ టీంలో వేశారు. కేవలం నా హైట్‌ కారణంగా నేను వాళ్లతో కలిసి ఆడాల్సొచ్చింది’ అంటూ షోలో నవ్వులు పంచారు.

ఇక తాజాగా అభిషేక్‌ బచ్చన్‌(Abhishek Bachchan)కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు రావడంపై బిగ్‌బీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ వేదికగా అభిషేక్‌కు అభినందనలు తెలిపారు. ‘నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నిన్ను విమర్శించేవారికి నీ పనితో సమాధానం చెబుతూ.. నీ సత్తా నిరూపించుకుంటున్నావు. యు ఆర్‌ ది బెస్ట్‌’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని