Pallavi Prashanth: ‘బిగ్‌బాస్ 7’ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టు
బిగ్‌బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్టయ్యాడు.
గజ్వేల్: బిగ్‌బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ (Pallavi Prasanth)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. టైటిల్ అందుకున్న రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. బుధవారం అతడి స్వగ్రామం కొలుగూరులో అరెస్టు చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే?
బిగ్‌బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్.. స్టూడియోస్ నుంచి బయటకు రాగా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్దీప్ సైతం బయటకు రావడంతో ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగలగొట్టారు. పలు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్‌గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం.. నటుడికి గాయం
‘థగ్ లైఫ్’ సెట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మలయాళ నటుడు జోజు జార్జ్ గాయపడ్డారు. -
ఇంటర్నేషనల్ అవార్డుల బరిలో ధనుష్ సినిమా..
ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డుల్లో నామినేషన్ దక్కించుకుంది. -
చిన్న గాయమే కానీ.. లావణ్య త్రిపాఠి క్లారిటీ
తనకు చిన్న గాయమే అయినట్టు నటి లావణ్య త్రిపాఠి స్పష్టం చేశారు. -
డేటింగ్ వార్తలపై స్పందించిన మమతా మోహన్ దాస్.. ఏమన్నారంటే
డేటింగ్ రూమర్స్‌పై నటి మమతా మోహన్‌దాస్ స్పందించారు. ఒకప్పుడు రిలేషన్లో ఉన్నట్లు చెప్పారు. -
చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే.. వైరల్ వీడియోపై మెగాస్టార్ పోస్ట్
స్టేజ్‌పై మోదీ ఏం మాట్లాడారో చిరంజీవి తెలిపారు. సోషల్ మీడియాలో వైరలైన వీడియోపై స్పందించారు. -
పూజాహెగ్డే సెల్ఫీ.. లంగావోణిలో రుహానీ.. రుక్సర్ ‘పింక్’ క్యాప్షన్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘కల్కి’ బుజ్జితో ఆనంద్ మహీంద్ర.. వీడియో షేర్ చేసిన నిర్మాణ సంస్థ
ఆనంద్ మహీంద్రా ‘కల్కి’ వాహనం బుజ్జిని నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ షేర్ చేసింది. -
పవన్ కల్యాణ్‌కు రేణు దేశాయ్ విషెస్.. పంచెకట్టులో అకీరా
పవన్ కల్యాణ్‌కు రేణు దేశాయ్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచెపంచకట్టులో వచ్చి ఆకట్టుకున్నారు. -
సమంత ధ్యానం.. హాట్ మౌనీరాయ్ .. స్టైలిష్ అనన్య
ఇన్‌స్టా వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్, పోస్ట్‌లు -
జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి : సమంత
కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు వెళ్లినప్పటి ఫొటోలను సమంత మరోసారి షేర్ చేశారు. -
సోనాక్షి పెళ్లి రూమర్స్.. స్పందించిన శతృఘ్న సిన్హా
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా వివాహంపై వచ్చిన రూమర్స్‌పై ఆమె తండ్రి, స్టార్ నటుడు శతృఘ్న సిన్హా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. -
దళపతి విజయ్ మంచి మనసు.. వారికి సన్మానం చేయనున్న హీరో
కోలీవుడ్ హీరో విజయ్ మరోసారి విద్యార్థులకు సాయం చేయనున్నారు. టెన్త్, ఇంటర్లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించనున్నారు. -
పెళ్లిరోజు వేడుకల్లో నయన్-విఘ్నేశ్.. క్యూట్ అంటూ కామెంట్స్
నయన-విఘ్నేశ్‌లు వారి రెండో పెళ్లి రోజును విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. -
విష్ణు ప్రియ ప్రేమ ధూపం.. కళ్లతో నభా నటేష్ కబుర్లు
సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం -
బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు: సమీరా రెడ్డి
కెరీర్ టాప్‌లో ఉన్న సమయంలోనే బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకోవాలని తనని కొందరు బలవంతం పెట్టినట్లు సమీరా రెడ్డి తెలిపారు. -
రామోజీరావు విజన్‌కు ఫిల్మ్ సిటీనే నిదర్శనం: విజయ్ సేతుపతి
రామోజీ ఫిల్మ్‌సిటీతో తనకెన్నో జ్ఞాపకాలున్నాయని హీరో విజయ్ సేతుపతి అన్నారు. రామోజీ ఇక లేరనే వార్త విని బాధ పడినట్లు చెప్పారు. -
అమెరికాలో సందడి చేసిన విజయ్ దేవరకొండ.. వీడియోలు వైరల్
విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. అక్కడ ఓ కార్యక్రమంలో సందడి చేశారు. -
ప్రియాంక మోహన్ ‘బ్లూ’.. ఐశ్వర్య సెల్ఫీ.. కృతి థాంక్స్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అర్జున్ ఇంట పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్
ప్రముఖ నటుడు అర్జున్ తనయ, నటి ఐశ్వర్య వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. హల్దీ, మెహందీ వేడుకల ఫొటోలు వైరల్‌గా మారాయి. -
నటుడు ప్రేమ్‌జీ వివాహం.. సందడి చేసిన సెలబ్రిటీస్
నటుడు ప్రేమ్‌జీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షాతో ‘సీరియస్ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/06/24)
-
భారత్ గురించి మరింత తెలుసుకోవాలని ఉందట..! చైనాలో ఆసక్తికర సర్వే
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్‌గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
-
అమెరికా విద్యార్థి వీసా ప్రక్రియ షురూ.. గతేడాది కంటే ఎక్కువ!
-
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్