botsa satyanarayana: చిత్ర పరిశ్రమ పిచ్చుక అని అంగీకరించారా? చిరు వ్యాఖ్యలపై బొత్స కౌంటర్‌

వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై వైకాపా నాయకులు స్పందించారు. సినిమా పరిశ్రమ ఒక పిచ్చుక అని భావిస్తున్నారా? అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Updated : 08 Aug 2023 17:05 IST

విజయవాడ: సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని అంగీకరించారా? చిరంజీవి (Chiranjeevi) చెప్పాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చిరంజీవి (chiranjeevi) నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఈ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు.

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?: చిరంజీవి

‘‘ఏపీలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. చిరంజీవి ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలి. ప్రతి సమస్యపై ప్రభుత్వం స్పందిస్తుంది. చిరంజీవి వ్యాఖ్యలు చూశాక పూర్తి స్థాయిలో స్పందిస్తాను. మేం వారాహి యాత్రను అడ్డుకోం. యాత్రల పేరుతో చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఊరుకోం. ప్రజాస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేసుకోవచ్చు. విశాఖలో పవన్‌ వారాహి యాత్రపై దేశమంతా చర్చ జరుగుతుందంటున్నారు. చంద్రబాబు పుంగనూరు యాత్ర మాదిరిగా విధ్వంసం చేయాలని చూస్తున్నారా?’’ అని బొత్స ప్రశ్నించారు.

వాళ్లకు కూడా సలహాలు ఇవ్వండి: కొడాలి నాని

‘‘ప్రభుత్వాలు ఎలా ఉండాలో చిత్ర పరిశ్రమలోని కొందరు వ్యక్తులు సలహాలు ఇస్తున్నారు. వారికి  కూడా సలహాలు ఇస్తే బాగుంటుంది. ‘మన ఇండస్ట్రీలో డ్యాన్స్‌లు, ఫైట్‌లు, యాక్షన్‌ గురించి మనం చూసుకుందాం. వేరే విషయాలు ఎందుకు’ అని చెప్పొచ్చు కదా. జనసేన పార్టీ కాదు, అది జనసున్నా పార్టీ. పవన్‌ రెండు చోట్ల పోటీ చేసి, నాలుగు చోట్ల ఓడిపోతారు’’ అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని