Cash: అది రష్మిక సాంగ్‌ అంటూ సుమకు తమన్నా పంచ్‌

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్‌ షో ‘క్యాష్‌: దొరికినంత దోచుకో’.

Published : 09 May 2022 13:04 IST

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్‌ షో ‘క్యాష్‌: దొరికినంత దోచుకో’. తాజాగా ఈ షో 200 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్‌ ఎపిసోడ్‌కు ‘ఎఫ్‌3’ చిత్ర బృందం వచ్చి సందడి చేసింది. కథానాయికలు తమన్నా, సోనాల్‌ చౌహాన్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడి, నటుడు సునీల్‌ ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘మైండ్‌ బ్లాక్‌’పాటకు తమన్నా డ్యాన్స్‌ వేసిందంటూ సుమ చెప్పటం, ఆ పాటకు డ్యాన్స్‌ వేసింది తాను కాదని, రష్మిక అంటూ మిల్కీబ్యూటీ సమాధానం ఇవ్వటంతో సుమ కంగుతిన్నారు. చిన్న పిల్లలు తల్లిదండ్రులను చాకెట్లు కావాలని ఎలా అడుగుతారో తమన్నా, సునీల్‌ చేసి చూపించటం నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ  కార్యక్రమంలో తమన్నా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఎందుకు కన్నీరు పెట్టుకున్నారో తెలియాలంటే మే 14న ఎపిసోడ్‌ చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని