Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌ ఓ సునామీ.. ‘భీమ్లా నాయక్‌’పై సెలబ్రిటీల ట్వీట్‌

ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూసిన ‘భీమ్లా నాయక్‌’ రానే వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ సూపర్‌హిట్‌ టాక్‌తో సందడి చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది.

Published : 26 Feb 2022 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూసిన ‘భీమ్లా నాయక్‌’ రానే వచ్చింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ సూపర్‌హిట్‌ టాక్‌తో సందడి చేస్తోంది. సోషల్‌ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. సగటు సినీ ప్రియుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి నోట ‘భీమ్లా నాయక్’ మాటే. సినిమా చూసిన వారు బాగుందని పోస్ట్‌లు పెడుతుంటే ఇంకా చూడని వారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరేమన్నారో చూసేయండి...

* ‘‘భీమ్లా నాయక్‌’ సినిమా ఓ భూకంపం. పవన్‌ కల్యాణ్‌ ఓ సునామీ. రానా గట్టి పోటీనిచ్చారు. ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేస్తే అక్కడా సంచలనం సృష్టిస్తుంది’’. - దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.

‘‘భీమ్లానాయక్‌’గా పవన్‌ కల్యాణ్‌ గారి నటన అద్భుతం. రానా పెర్ఫామెన్స్‌ అదుర్స్‌. తమన్‌ నేపథ్యం సంగీతం సన్నివేశాల్ని మరోస్థాయికి తీసుకెళ్లింది. సాగర్‌ కె. చంద్ర, త్రివిక్రమ్‌గారి పనితనం అద్భుతంగా ఉంది’’.  -దర్శకుడు అనిల్‌ రావిపూడి.








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని