Updated : 10 Jun 2021 15:24 IST

Balakrishna: బాలయ్య బర్త్‌డే.. చిరు ట్వీట్‌

శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు

హైదరాబాద్‌: నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

‘మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ - చిరంజీవి

‘జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ - తారక్‌

నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సినిమాలతో వినోదాన్ని పంచుతూ.. సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నా. - భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌

‘జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక పాత్రలలో అద్భుతంగా నటించి తనదైన ముద్రవేస్తూ, సాంఘిక సేవా కార్యక్రమాలలో నిత్యం పాల్గొంటూ, నందమూరి తారకరామారావు గారి వారసత్వానికి వెలుగు తెచ్చిన నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం నేడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు..’ - పరుచూరి గోపాలకృష్ణ

‘రియల్‌ లెజండ్‌ నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘అఖండ’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ - నాగశౌర్య

‘నవయవ్వనుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అన్ని శుభాలే జరగాలని దేవుడ్ని కోరుకుంటున్నాను’ - క్రిష్‌

‘అశేష జన మానస చోరుండ! జనం మెచ్చిన కథా నాయకుండ! అఖిలాంధ్ర జన కోటి సేవకుండ! వేయేండ్లు జీవించు ఓ 'అఖండ'!! బసవతారక పుత్ర నందమూరి నటసింహానికి జన్మదిన శుభాకాంక్షలు’ - ప్రసాద్‌ వి.పొట్లూరి

‘నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నాను’ - సురేందర్‌ రెడ్డి

‘నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు మీ సొంతం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ - బాబీ

‘హ్యాపీ బర్త్‌డే బాలయ్య బాబు గారు. త్వరలో మిమ్మల్ని సెట్స్‌లో కలవడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను. మీ సింహగర్జనను ప్రత్యేక్షంగా చూసేందుకు సిద్ధంగా ఉన్నాను’ - గోపీచంద్‌ మలినేని

‘తెలుగు వాచకానికి తలకట్టు, తెలుగు పౌరుషానికి మణికట్టు, తెలుగు రూపానికి పంచెకట్టు.. వెరసి తెలుగు తేజం కలకాలం నిలబెట్టు.. నందమూరి బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు’  - బీవీఎస్‌ రవి


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని