Chiranjeevi: బాధ్యతని చాటి... స్ఫూర్తిని పంచి..

హైదరాబాద్‌ నగరం ఓటు వేయడానికి బద్దకిస్తున్న వేళ... సినీ తారలు మాత్రం ఉత్సాహంగా పోలింగ్‌ బూత్‌లవైపు కదిలారు.

Updated : 01 Dec 2023 10:39 IST

హైదరాబాద్‌ నగరం ఓటు వేయడానికి బద్దకిస్తున్న వేళ... సినీ తారలు మాత్రం ఉత్సాహంగా పోలింగ్‌ బూత్‌లవైపు కదిలారు. పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే పలువురు తారలు కుటుంబ సభ్యులతో కలిసి వరుసల్లో నిల్చొని తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బాధ్యతని నిర్వర్తించడంలోనూ...స్ఫూర్తిని పంచడంలోనూ ఆదర్శంగా నిలిచారు. గురువారం తెలంగాణ శాసన సభ ఎన్నికల దృష్ట్యా సినీ తారలంతా ముందు రోజే సినిమాలకి ప్యాకప్‌ చెప్పేశారు. పలువురు తారలు చిత్రీకరణల నుంచి విరామం తీసుకుని నగరానికి తరలివచ్చారు. రామ్‌చరణ్‌ మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రీకరణ నుంచి ఎన్నికల కోసమే ప్రత్యేకంగా వచ్చారు. అలా పలువురు తారలు తమ సినిమాలకి విరామం ఇచ్చి ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ‘మేం ఓటేశాం, మరి మీరూ?’ అని ప్రశ్నిస్తూ బాధ్యతని గుర్తు చేశారు. ఆయా పోలింగ్‌ బూత్‌ల దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఓటు విలువ గురించి చెబుతూ, అందరూ హక్కుని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కువమంది తారలు తాము నివాసం ఉండే జూబ్లీ హిల్స్‌ ప్రాంతంలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని