హిందీ ‘చత్రపతి’కి రంగం సిద్ధం

మరో టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విజయ్‌దేవరకొండ వంటి పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు హిందీలో తమకంటూ ఓ క్రేజ్‌ తెచ్చుకున్నారు. ఇప్పుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమయింది.

Published : 16 Jul 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ వంటి పలువురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు హిందీలో తమకంటూ ఓ క్రేజ్‌ తెచ్చుకున్నారు. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ బాలీవుడ్‌లో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే పూజా కార్యక్రమంతో ‘చత్రపతి’ రీమేక్‌ పట్టాలెక్కనుంది. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ ఇక్కడ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయనున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. BSS9 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ముంబయిలో ఈ తొలిపూజ కార్యక్రమం ఉంటుందని నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్‌ ప్రకటించింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ను ‘అల్లుడు శీను’ చిత్రంతో తెలుగులోనూ వినాయక్‌ దర్శకత్వంలోనే పరిచయం చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని