Kaikala Satyanarayana: సత్యనారాయణకు ఆ రెండూ ప్రాణం: చిరంజీవి
కైకాల సత్యనారాయణ మరణం తనని ఎంతగానో కలచి వేసిందని చిరంజీవి అన్నారు. ఆయనతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.
హైదరాబాద్: కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మరణం పట్ల సంతాపం ప్రకటించారు నటుడు చిరంజీవి (Chiranjeevi). ఆయన మరణం తనని ఎంతగానో కలచివేసిందన్నారు. నటన, రుచికరమైన భోజనం.. ఈ రెండూ ఆయనకు ప్రాణమని చిరు చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడాయన. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. అలా ఆయన వ్యక్తిత్వాన్నిదగ్గర నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కింది. డైలాగులు చెప్పడంలో ఆయనది ప్రత్యేక పంథా. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు. నన్ను ‘తమ్ముడు’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. ‘‘అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు.. ‘‘మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు.
సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి రాసుకొచ్చారు.
చిరంజీవి నటించిన ‘విజేత’, ‘కొండవీటి రాజా’, ‘మగధీరుడు’, ‘చక్రవర్తి’, ‘జేబుదొంగ’, ‘మంచిదొంగ’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం :786’, ‘రుద్రవీణ’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘స్టేట్ రౌడీ’, ‘కొదమసింహాం’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘మెకానిక్ అల్లుడు’, ‘బావగారు బాగున్నారా’ తదితర చిత్రాల్లో సత్యనారాయణ కీలకపాత్రలు పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. -
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పారు. -
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
మనిషి కోరికలకు అంతం ఉండదని అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ సరదాగా అన్నారు. -
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
ఓ బాలీవుడ్ చిత్రంలో నటించినందుకు తనకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయని నటి ఇలియానా అన్నారు. -
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్‌కు హీరోయిన్ ఘాటు రిప్లై
మలయాళీ నటి మాళవిక మోహనన్ ఓ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే? -
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్‌కుమార్
నెగెటివ్ కామెంట్స్‌ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్‌లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర