Chiranjeevi: ‘బింబిసార’, ‘సీతారామం’పై చిరు ప్రశంసలు.. మెచ్చుకుంటూ ట్వీట్‌

టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కిన హిస్టారికల్‌ మూవీ ‘బింబిసార’(Bimbisara), యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ లవ్‌స్టోరీ ‘సీతారామం’(SitaRamam) చిత్రాలు శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంప...

Updated : 06 Aug 2022 10:52 IST

హైదరాబాద్‌: టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’(Bimbisara). యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఎమోషనల్‌ లవ్‌స్టోరీ ‘సీతారామం’(SitaRamam). ఈ రెండు చిత్రాలు శుక్రవారం విడుదలై విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రబృందాలను మెచ్చుకుంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడంలేదని బాధపడుతున్న చిత్రపరిశ్రమకు ఎంతో ఊరటని, మరింత ఉత్సాహాన్నిస్తూ.. కంటెంట్‌ బాగుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ శుక్రవారం విడుదలైన చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ‘సీతారామం’, ‘బింబిసార’ నటీనటులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక బృందానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’’ అని చిరు పేర్కొన్నారు.

మరో నటుడు విజయ్‌ దేవరకొండ సైతం ఈ రెండు చిత్రాల విజయాలపై స్పందిస్తూ.. ‘‘ఒకే రోజు విడుదలైన రెండు చిత్రాలూ విజయం అందుకున్నాయని తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. వాట్‌ ఏ గుడ్‌ డే..!! వైజయంతి మూవీస్‌, దర్శకుడు హను రాఘవపూడి, దుల్కర్‌ సల్మాన్‌, సుమంత్‌, మృణాల్‌, రష్మిక అందరికీ అభినందనలు. మీ సినిమా గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు వింటున్నా. ఇక, విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘బింబిసార’ టీమ్‌ నందమూరి కల్యాణ్‌ రామ్‌, వశిష్ఠ, కీరవాణి.. ఇతర బృందం మొత్తానికి శుభాకాంక్షలు’’ అని విజయ్‌ ట్వీట్‌ చేశారు. చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు చూస్తున్నామని, ఒకేరోజు రెండు సినిమాలు విడుదలై.. అవి రెండూ సక్సెస్‌ అందుకోవడంపై సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని