Chiranjeevi: ఆమే పెద్ద విమర్శకురాలు: చిరంజీవి
అభిమానులు తనపై చూపించే ప్రేమాభిమానాల వల్లే తానింకా సినిమాల్లో నటించగలుగుతున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘గాడ్‌ఫాదర్’ సక్సెస్‌పై ఆయన తాజాగా ముచ్చటించారు.
హైదరాబాద్: ‘గాడ్ ఫాదర్’ (Godfather) విజయంపై ఆనందం వ్యక్తం చేశారు అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిరు తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘విజయవంతమైన చిత్రాన్ని రీమేక్ చేయడం ఛాలెంజ్‌తో కూడుకున్నది. ఎందుకంటే ఒరిజినల్ స్టోరీని అప్పటికే ప్రేక్షకులు చూసి ఉంటారు. దానికి ఏమాత్రం తగ్గకుండా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథను నడిపించాలి. గతంలోనూ నేను రీమేక్స్ చేశా. అయితే, రామ్‌చరణ్ చెప్పడం వల్లే ఈ సారి ‘గాడ్‌ఫాదర్’లో నటించా. ఈ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఇందులో నా పాత్రకు డ్యాన్స్‌లు, కామెడీ డైలాగ్‌లు ఉండవు. ఇక, నా వరకూ గొప్ప విమర్శకురాలు నా భార్య సురేఖ. ఏదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేస్తుంది. ఆమె అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా’’
‘‘ప్రస్తుత కాలంలో దక్షిణాది చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయన్నది ఎంత వాస్తవమో.. ప్రతి దక్షిణాది చిత్రం విజయం సాధించలేకపోతుందనేదీ అంతే వాస్తవం. అదేవిధంగా బాలీవుడ్ నుంచి వచ్చిన ప్రతి చిత్రమూ విఫలం కావడం లేదు. సినిమా ఏం ప్రాంతానిదనేది కాదు.. కంటెంట్ మాత్రమే ముఖ్యం. అదే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. ఇకపై మనం ప్రాంతీయ చిత్రం అనే ట్యాగ్స్ వదిలి ముందుకు సాగాలి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని కాకుండా ఇండియన్ సినిమాగా అభివర్ణించాలి’’ అని చిరు వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Marriage: 28 ఏళ్ల కోడలిని పెళ్లాడని 70 ఏళ్ల మామ
-
Sports News
Australian open: కెరీర్ చివరి మ్యాచ్‌లో సానియాకు నిరాశ.. మిక్స్డ్ డబుల్స్‌లో ఓటమి
-
India News
జన్మభూమి సేవలో అజరామరుడు.. కానిస్టేబుల్ అహ్మద్ షేక్‌కు మరణానంతరం శౌర్యచక్ర
-
Ap-top-news News
Andhra News: కల్యాణ మండపంలో కలకలం.. ఉన్నట్లుండి ఊడిపోయి పైకి లేచిన ఫ్లోరింగ్ టైల్స్
-
Crime News
Crime News: బ్రెయిన్ మ్యాపింగ్‌తో హత్య కేసులో నిందితుల గుర్తింపు
-
Politics News
Balakrishna: బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం