Chiranjeevi: త్రిషకు మద్దతుగా చిరంజీవి

త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తెలుగు కథానాయకుడు చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ‘లియో’లో అతిథి పాత్ర పోషించిన మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Updated : 22 Nov 2023 09:32 IST
త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తెలుగు కథానాయకుడు చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ‘లియో’లో అతిథి పాత్ర పోషించిన మన్సూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. త్రిషతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం రాలేదంటూ కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌పై త్రిష అగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతనితో కలిసి ఇకపై నటించనని కూడా తెలిపింది. తాజాగా త్రిషకు మద్దతు తెలుపుతూ.. చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఒక నటిని మాత్రమే కాదు..ఏ స్త్రీని ఇలా అనకూడదు. చాలా అసహ్యంగా మాట్లాడారు. వీటిని తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలా మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు...ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా నేను అండగా ఉంటాను’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. తనకు మద్దతుగా నిలిచిన చిరంజీవికి, ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కి, గాయని చిన్మయికి కృతజ్ఞతలు తెలిపింది త్రిష.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని