Chiranjeevi: విశ్వంభర సన్నాహాలు

కొత్త ఏడాది చిరంజీవికి అదిరే ఆరంభాన్నిచ్చింది. పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కడంతో ఆయన ఇంట్లో ప్రస్తుతం పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడీ జోష్‌లోనే తన కొత్త చిత్రం ‘విశ్వంభర’ కోసం రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు చిరు.

Updated : 29 Jan 2024 11:30 IST

కొత్త ఏడాది చిరంజీవికి అదిరే ఆరంభాన్నిచ్చింది. పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కడంతో ఆయన ఇంట్లో ప్రస్తుతం పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడీ జోష్‌లోనే తన కొత్త చిత్రం ‘విశ్వంభర’ కోసం రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నారు చిరు. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకున్నప్పటికీ చిరు ఇంకా సెట్స్‌లోకి అడుగు పెట్టలేదు. ఆయన ఫిబ్రవరి తొలి వారం నుంచి మొదలు కానున్న కొత్త షెడ్యూల్‌తో సెట్స్‌లోకి రానున్నారని సమాచారం. ఇందుకోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేసే పనిలో ఉంది చిత్ర బృందం. దాంట్లోనే చిరుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇదొక భిన్నమైన సోషియో ఫాంటసీ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌. దీని కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించనుంది చిత్ర బృందం. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఆయనకు జోడీగా ఇద్దరు నాయికలు ఉంటారని తెలిసింది. సంగీతం: ఎంఎం కీరవాణి, ఛాయాగ్రహణం: ఛోటా కె నాయుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని