
Chiranjeevi: క్వారంటైన్ వల్ల తల్లిని కలవలేకపోతున్న చిరంజీవి
ఎమోషనల్ పోస్ట్ పెట్టిన మెగాస్టార్
హైదరాబాద్: క్వారంటైన్లో ఉండటం వల్ల తన మాతృమూర్తి అంజనాదేవీని కలవలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న విషయం తెలిసిందే. శనివారం తన తల్లి పుట్టినరోజు పురస్కరించుకుని సోషల్మీడియా వేదికగా చిరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోని ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
‘‘అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు’’ అని చిరు పేర్కొన్నారు. ఇందులో చిరు తన సొంత పేరు శివ శంకర వరప్రసాద్ (శంకరబాబు) ఉపయోగించడంతో అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. ‘‘అభిమానులందరికీ ఆయన మెగాస్టార్ లేదా చిరంజీవి కావొచ్చు. కానీ.. తన తల్లికి మాత్రం శంకరబాబునే కదా’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.