Shankar: ఘనంగా శంకర్‌ కుమార్తె వివాహం 

కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఆదివారం ఉదయం వేడుకగా జరిగింది. రోహిత్‌ దామోదరన్‌ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు....

Published : 27 Jun 2021 15:01 IST

పెళ్లి వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై: కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ఆదివారం ఉదయం వేడుకగా జరిగింది. రోహిత్‌ దామోదరన్‌ అనే క్రికెటర్‌తో ఆమె ఏడడుగులు వేశారు. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆయన కుమారుడు ఉదయనిధి విచ్చేసి వధూవరులకు అభినందనలు తెలిపి వాళ్లని ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, ఇరు కుటుంబ పెద్దలతో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

రోహిత్‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌లో క్రీడాకారుడు. ఆయన తండ్రి దామోదరన్‌ చెన్నైకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. మదురై పాంతర్స్‌ క్రికెట్‌ టీమ్‌కి ఆయన యజమాని.  ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలోనే మహాబలిపురంలో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని