Colours Swathi: అలాంటి పాత్రలు చేయడానికి అంగీకరించలేదు..: కలర్స్ స్వాతి
కలర్స్ స్వాతి (Colours Swathi) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకుంది. రూమర్స్‌ను పట్టించుకోనని చెప్పింది.
హైదరాబాద్: బుల్లితెర ఆడియన్స్‌ను తన సరదా మాటలతో అలరించి ఆ తర్వాత వెండితెరపై మెరిసింది కలర్స్ స్వాతి. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో తనదైన నటనతో మెప్పించింది. త్వరలోనే ‘మంత్ ఆఫ్ మధు’ (Month Of Madhu)తో పలకరించనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకుంది.
‘‘కెరీర్ ప్రారంభంలో చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ లో వెంకటేష్ లాంటి అగ్ర హీరోకు మరదలిగా నటించాను. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎక్కువగా మరదలి పాత్రలే వచ్చాయి. సైడ్ క్యారెక్టర్లు చేయడం ఎందుకని తిరస్కరించాను. గ్రాఫ్ కొంచెం డల్‌గా అవుతుంది అనుకునే సమయానికి మంచి హిట్ వచ్చేది. ‘కార్తికేయ’, ‘స్వామిరారా’.. వంటి సినిమాల్లో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ‘డేంజర్’ (Danger) సినిమా చేసినప్పుడు నాపై చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నేను అసలు పట్టించుకోలేదు. అవి రూమర్స్ అని తెలిసినప్పుడు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం’’ అని చెప్పింది.
ఇక కలర్స్ స్వాతి హీరో నాని (Nani) సరసన నటించిన ‘అష్టా చమ్మా’లో (Ashta Chamma) అద్భుతమైన నటనకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. అలాగే నంది అవార్డును కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు
-
Movies News
ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
World News
అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన
-
Politics News
Smriti Irnai: మంత్రి మిస్సింగ్ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ!