Deepika padukone: అప్పట్లో ఉండటానికి చిన్న గది కూడా ఉండేది కాదు: దీపికా పదుకొణె

పదిహేడేళ్ల వయసంటే ఇంకా లోకం పోకడలు కూడా సరిగా తెలియని ప్రాయం. ఆ సమయంలోనే తన కలల కెరీర్‌ వెతుక్కుంటూ బెంగళూరు నుంచి ముంబయిలో అడుగు పెట్టింది దీపికా పదుకొణె.

Updated : 10 Apr 2024 09:31 IST

పదిహేడేళ్ల వయసంటే ఇంకా లోకం పోకడలు కూడా సరిగా తెలియని ప్రాయం. ఆ సమయంలోనే తన కలల కెరీర్‌ వెతుక్కుంటూ బెంగళూరు నుంచి ముంబయిలో అడుగు పెట్టింది దీపికా పదుకొణె. ఆ సమయంలో తనెదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి ఇటీవలే ఒక పత్రికతో పంచుకుందామె. ‘సినిమాలంటే నాకు మొదట్నుంచీ ఇష్టమే. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఆ చిన్న వయసులోనే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నానా? అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. కానీ ఆ సమయంలో మనసులో అనుకోగానే చాలా తేలిగ్గా ఇంట్లోంచి బయటికొచ్చేశా’ అంటూ ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది. ‘ఆ సమయంలో నాకు కనీసం చిన్న గది కూడా ఉండేది కాదు. తెలిసినవాళ్ల దగ్గరో.. మోడలింగ్‌ చేసే షూటింగ్‌ స్పాట్‌లోనో ఉంటూ.. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా పని చేస్తూనే ఉండేదాన్ని. దర్శకురాలు ఫరాఖాన్‌ దృష్టిలో పడి, ‘ఓం శాంతి ఓం’లో అవకాశం చేజిక్కించుకునే వరకూ నా కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది. దీపిక ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘సింగం అగైన్‌’ అనే చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని