Dhee 14: జానీ మాస్టర్‌కే డ్యాన్స్‌ నేర్పించిన హైపర్‌ ఆది!

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీకే మాస్టర్‌కే డ్యాన్స్‌ ఎలా చేయాలో నేర్పించాడు హైపర్‌ ఆది.

Published : 04 Mar 2022 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కే డ్యాన్స్‌ ఎలా చేయాలో నేర్పించాడు హైపర్‌ ఆది. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే అతిపెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షో ‘ఢీ 14’ వేదికపై తన ప్రతిభను ప్రదర్శించాడు. జానీ మాస్టర్‌ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణీతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కంటెస్టెంట్‌లు సాయి- నైనికా పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన జానీ మాస్టర్‌ నైనికతో కలిసి స్టెప్పులేశారు. ఆయన డ్యాన్స్‌ చూసిన ఆది ‘ఇలా కాదు మాస్టర్‌’ అంటూ తనదైన శైలిలో నృత్యం చేసి అలరించాడు. తర్వాత, ఆది సూచించినట్టు కాకుండా చాలా కొత్తగా డ్యాన్స్‌ చేసి జానీ మాస్టర్‌ కడుపుబ్బా నవ్వించారు. అనంతరం, కార్యక్రమ వ్యాఖ్యాత ప్రదీప్‌, ఆది, అఖిల్‌ పంచ్‌లతో గిలిగింతలు పెట్టారు. జానీ మాస్టర్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఆ పాట మరేదో కాదు నాగార్జున ద్విపాత్రిభినయం చేసిన ‘హలో బ్రదర్’ చిత్రంలోని ‘ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ’. మరో ముగ్గురు కంటెస్టెంట్‌లు కలిసి నర్తించిన ‘మనసులే కలిసెలే’ (దేశ ముదురు) గీతానికి మరో న్యాయనిర్ణేత ప్రియమణి ముగ్దురాలయ్యారు. ఈ ఫుల్‌ మస్తీ ఎపిసోడ్‌ మార్చి 9న ప్రసారంకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని