Dhee 14: కంటెస్టెంట్‌కి జానీ మాస్టర్‌ స్పెషల్ గిఫ్ట్

‘నందీకొండా వాగుల్లోనా’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి.. తన మూమెంట్స్‌తో అందర్నీ మెప్పించిన ఓ కంటెస్టెంట్‌కు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు...

Updated : 11 Mar 2022 12:13 IST

హైదరాబాద్‌: ‘నందీకొండా వాగుల్లోనా’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి.. తన మూమెంట్స్‌తో అందర్నీ మెప్పించిన ఓ కంటెస్టెంట్‌కు కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. డ్యాన్స్‌తో మెప్పించిన ఆమెకు ఖరీదైన జాకెట్‌ బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పారు. ఆయన మాటలతో కంటెస్టెంట్‌తోపాటు టీమ్‌ మొత్తం ఆనందం వ్యక్తం చేసింది. ఈ మంచి కార్యక్రమానికి ‘ఢీ 14’ వేదికైంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్‌ షో ‘ఢీ14’. ప్రియమణి, జానీ మాస్టర్‌, నందితా శ్వేత న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ షో లేటస్ట్‌ ప్రోమో విడుదలైంది. ప్రదీప్‌, హైపర్‌ ఆది, అఖిల్‌, రవికృష్ణ, నవ్యస్వామిల కామెడీ టైమింగ్‌తో ఎప్పటిలాగానే వచ్చేవారం ఎపిసోడ్‌లోనూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండనున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. మరి, రానున్న ఎపిసోడ్‌లో ఎవరు డ్యాన్స్‌తో మెప్పించనున్నారు? ఏ టీమ్‌ టాప్‌లోకి రానుంది?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని