Game Changer: గేమ్‌ ఛేంజర్‌ ఆ రోజేేనా?

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 24 Dec 2023 10:42 IST

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ రూపొందిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయంపై దిల్‌రాజు స్పందించారు. ఇటీవల ‘సలార్‌’ చిత్రం వీక్షించడం కోసం థియేటర్‌కు వచ్చిన ఆయన్ని పలువురు అభిమానులు ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదలెప్పుడని ప్రశ్నించగా.. ‘‘సెప్టెంబరులో’’ అంటూ బదులిచ్చి వెళ్లిపోయారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి దీన్ని వినాయక చవితి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో చరణ్‌ భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: తిరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని