Dilraju: నేను ఆకాశంలాంటి వాడిని.. పెళ్లి విషయంలో ట్రోల్స్‌పై స్పందించిన దిల్‌ రాజు

తనపై వచ్చే ట్రోల్స్‌పై నిర్మాత దిల్‌ రాజు (Dilraju) స్పందించారు. 

Updated : 05 Apr 2024 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్రోల్స్‌ గురించి ఆలోచించకూడదని నిర్మాత దిల్‌ రాజు (Dilraju) అన్నారు. పరుశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ ట్రోల్స్‌పై తనదైనశైలిలో స్పందించారు.

‘‘నాకు గతంలో అసలు మీమ్స్‌ గురించి అవగాహన లేదు. నా పెళ్లి తర్వాత ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా భార్యను ఎలా కలిశాను.. మా జర్నీ ఎలా మొదలైందో చెప్పాను. ఆ వీడియోపై ట్రోల్స్‌ చేశారు. అవి నా భార్య చూపించింది. నేను వాటి గురించి పట్టించుకోను. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టేవారు కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్‌ చేసేవాళ్లు పదివేల మంది ఉంటారంతే. ఇలా ట్రోల్స్‌, నెగెటివ్ కామెంట్స్‌ చేసేవాళ్ల గురించి పట్టించుకుంటే నేను మిగతా వాళ్లకు దూరమవుతాను. అందుకే నేను అలాంటి వాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించను. నెగిటివిటీని మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అయినా అవ్వన్నీ వస్తూపోతూ ఉండే మేఘాల్లాంటివి. వాటికి భయపడితే ఎలా? నేను ఆకాశం లాంటివాడిని. అవేమైనా చంపేస్తాయా.. చంపలేవు కదా! అలాంటి మేఘాలన్నీ వెళ్లిపోయాక మనకు ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది’ అన్నారు.

ఇక ‘ఫ్యామిలీ స్టార్‌’ తనకెంతో ప్రత్యేకమని దిల్ రాజు చెప్పారు. 21ఏళ్ల క్రితం ఇదే రోజున ‘దిల్‌’ సినిమా విడుదలై తనకు మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అదే తేదీలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రావడం ఆనందంగా ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని