SIR: ధనుష్‌ చిత్రంపై ప్రముఖ దర్శకుడు భారతిరాజా ప్రశంసలు

వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) నటించిన చిత్రం ‘సార్’ (SIR). తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు భారతిరాజా (Bharathiraja) ప్రశసంలు కురిపించారు. 

Published : 20 Feb 2023 13:49 IST

చెన్నై: ధనుష్ (Dhanush)‌, సంయుక్త (Samyuktha) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సార్’ (SIR)‌. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ధనుష్‌ సార్‌ పాత్రలో మెప్పించిన ఈ సినిమాపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు భారతిరాజా (Bharathiraja) ఈ సినిమా చూసి చిత్రబృందాన్ని అభినందించారు.

విద్య ప్రాముఖ్యాన్ని ఈ సినిమాలో బాగా చూపించారని చెప్పిన భారతీరాజా ‘‘నా జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. సినిమాలు వినోదం పంచడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో ‘సార్‌’ ఒకటి. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరు బాగుంది. ఇటీవల కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాను థియేటర్లలో చూసి.. ఆ అనుభూతిని నాతో పంచుకోండి’’ అని కోరారు. ఇక ధనుష్‌ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడని పొడగ్తలు కురిపించారు. అలాగే టీచర్‌ పాత్రలో సంయుక్త చాలాబాగా చేసిందన్నారు. ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పారు. మంచి సంగీతాన్ని అందించినందుకు జీవీ ప్రకాష్‌ (GV Prakash)ను భారతిరాజా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని